HomeCRIMEఎటియం లూటీ కి యత్నం .....వెంటాడిన పోలీసులు ......పాల్డ లో కారు వదిలేసి పారిపోయిన ముఠా...

ఎటియం లూటీ కి యత్నం …..వెంటాడిన పోలీసులు ……పాల్డ లో కారు వదిలేసి పారిపోయిన ముఠా ……

నిజామాబాద్ నగరం లో ఓ ముఠా ఎటియం చోరీ కి యత్నించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం తో హుటాహుటిన పోలీసులు రంగం లోకి దిగడంతో దొంగలు పారిపోయారు.

పెట్రోలింగ్ లో ఉన్న రెండు వాహనాలు వెంటాడంతో పాల్డ గ్రామం వద్ద తమ వాహనం వదిలేసి చీకట్లో తప్పించుకున్నారు.

నగరంలోని ఉమెన్స్ కాలేజీ సమీపంలో ఎస్బిఐ బ్యాంకు కు చెందిన ఏ టియం లో తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు చొరబడ్డారని స్థానికులు ఇచ్చిన సమాచారం తో మూడో టౌన్ ఎస్సై వెంటనే వెళ్లారు పోలీసులు రాక ను గమనించిన దొంగలు హుటాహుటి ఏటియం నుంచి బయటికి వచ్చి మారుతి ఓమిని వ్యాన్ లో కొత్త కలెక్టరేట్ పారిపోయారు. ఎస్సై వారిని వెంబడించారు.

పెట్రలోలింగ్ లో ఉన్న ఇతర స్టేషన్ లవాహనాలను అలర్ట్ చేసారు. రూరల్ పోలీస్ స్టేషన్ వాహనం సైతం కాలూర్ వైపే వుండడంతో దొంగలు పారిపోతున్న వాహనం వారుకూడా వెంబడించారు.

పోలీస్ వాహనాల వెంటాడుతుండడంతో దొంగలు తమ వాహనం ను పాల్డ గ్రామంలోకి వెళ్లి వదిలేసారు.పారిపోయారు.అనంతరం ఏటియం వద్ద వచ్చి అరా తీయగా మిషన్ ధ్వంసం అయింది కానీ అందులో నగదు మాత్రం పోలేదని పోలీసు లు చెప్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments