ఆదివారం అర్థరాత్రి నుంచి ఆటో లు నిరవధిక బంద్ కు పిలుపు నిచ్చాయి తమ న్యాయ మైన డిమాండ్ ల సాధన కోసం ఆటో యూనియన్ సమ్మె కు సిద్ధం అయింది ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయిందని వారు వాపోయారు.
ఆటో సమ్మె ను ఉపసంహరించుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమ్మెల వల్ల సమస్యలు పరిష్కారం కావు అని, చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఇవాళ హుస్నాబాద్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మాట్లాడుతూ ఆటోలో బంద్‍పై మాట్లాడారు . పెరిగిన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటో ఛార్జీల పెంపుపై అధ్యయనం చేయడానికి త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని వేస్తామన్నారు.
ఈ కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులతో పాటు రవాణా శాఖ అధికారులను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. అలాగే ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే విధివిధానాలు రూపొందించి బోర్డును అందుబాటులోకి తెస్తామని వివరించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించామో,అదే తరహా లో ఆటో డ్రైవర్ల సమస్యల ను పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు
