మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జరిగిన తొక్కిస లాట ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసారు యునివర్సిటీ నిర్వాహకుల తో పాటు సినిమా నిర్మాణ బాద్యుల మీద కేసులు నమోదు చేసారు.పే
ట్ బషీరాబాద్ పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం రంగంలోకి దిగారు ప్రముఖ కన్నడ నటుడు యాష్ నటించిన టాక్సిక్ సినిమా ప్రమోషన్ ను మల్లారెడ్డి యునివర్సిటీ లో శనివారం నిర్వహించారు .
వేదిక సమీపంలో క్రౌడ్ విపరీతంగా పెరగడంతో కొంతమంది యువకులు ఫ్లడ్ లైట్ స్తంభాలు, భారీ సౌండ్ బాక్సులకు అమర్చిన ఐరన్ పోల్స్‌పైకి ఎక్కారు. ఈ క్రమంలో బరువు ఎక్కువై భారీ సౌండ్ బాక్స్ అమర్చిన ఒక పోల్ ఉన్నపళంగా కిందపడిపోయింది.
ఈ క్రమంలోనే తొక్కిసలాట సైతం చోటు చేసుకుంది హీరో యాష్ మాట్లాడుతుండగానే ఈ ఘటన జరిగింది పోల్ మీద నుంచి కింద పడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.యాష్ సైతం తన స్పీచ్ ను మధ్య లోనే ఆపేసారు
