తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు రోజుల లండన్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. హైదారాబాద్ వచ్చాక ఆయన కీలక విషయాలమీద మాట్లాడే ఛాన్స్ ఉంది ఆయన అక్కడి నుంచే అమెరికా కు వెళ్లాల్సి వుండే కానీ కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది దీనితో ఆయన అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది .
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే, యూఎస్ పర్యటనలకు ప్రభుత్వం ముందుగానే అనుమతులు కోరినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కేవలం లండన్ పర్యటనకే క్లియరెన్స్ ఇచ్చి, అమెరికా పర్యటనకు ‘రాజకీయ కోణం’ చూపిస్తూ అనుమతి నిరాకరించిందని సీఎం తెలిపారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గళమెత్తి సీఎం రేవంతు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఖర్గేకు రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తన లండన్ పర్యటన అత్యంత విజయవంతంగా ముగిసిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడా రంగాలు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో తెలంగాణకు కీలకమైన భాగస్వామ్యాలు కుదిరాయని పేర్కొన్నారు.
