లారీ ఢీ కొని ఆయుర్వేదిక్ డాక్టర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో బుదవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.. తల్వేద గ్రామానికి చెందిన జిడ్డం హనుమండ్లు (54)ఆయుర్వేదిక్ డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ మేరకు అతనికి నగరంలోని గోల్ హనుమాన్ వద్ద ఆయుర్వేదిక్ సెంటర్ ఉన్నట్లు తెలిపారు.ఈ మేరకు పనులు నిమిత్తం హనుమాండ్లు,శేషత్వం శ్రీనివాస్ లు ఇద్దరు వినాయక్ నగర్ వెళ్లి వస్తుండగా పులాంగ్ సిగ్నల్ వద్ద ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వీరిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
