కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు, చిన్నపిల్లల టార్గెట్ గా కిడ్నాపర్లు బరితెగిస్తున్నారు అన్యం పుణ్యం ఎరుగని అమాయక చిన్నారులను అపహరించుకుపోయి అమ్మకానికి పెడుతున్నారు.
గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి నుండి మూడేళ్ల బాలుడిని అపహరించిన అగంతకుల ఆచూకిని మెట్పల్లిలో పోలీసులు కనిపెట్టారు.
దీంతో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది . నిజామాబాద్ జిల్లాలో గత ఆరు నెలల్లో నలుగురు చిన్నారుల కిడ్నాప్ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతున్నాయి.
తాజాగా చోటు చేసుకున్న నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ అయిన విషయంలో చిన్న బిడ్డల తల్లిదండ్రులు కలవరం చెందుతున్నారు.
కాగా జనవరి 30న మాలపల్లికి చెందిన ఏడేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విక్రయించేందుకు చూశారు. ఫిబ్రవరిలో ఆర్మూర్ బస్టాండ్ లో ఓ మహిళ ఏడేళ్ల బాలుడిని, అదే ఫిబ్రవరి నెల నాలుగవ తేదీన నిజామాబాద్ నగర శివారులో ఓ దంపతులు రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు.
అయితే ఈ కేసులను పోలీసులు ఛేదించి చిన్నారులను కాపాడినప్పటికి చిన్నారుల తల్లిదండ్రులు మాత్రం కలవరం రేపుతోంది.