HomeDevotionalనగరంలో మొదలైన ఊరపండగ సన్నాహాలు .....గాజుపేట్ లో అట్టహాసంగా బండారు .........

నగరంలో మొదలైన ఊరపండగ సన్నాహాలు …..గాజుపేట్ లో అట్టహాసంగా బండారు ………

నిజామాబాద్ నగరంలో ఊరపండుగ సన్నాహాలు మొదలు అయ్యాయి. నిజామాబాద్ సర్వసమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 28 ఆదివారం జరుగబోయే ఊర పండుగలో భాగంగా ఈ మంగళవారం బండారు పోయడంఆనవాయితీ ఇందులో భాగంగా గాజులపేట్ విజయ్ కిసాన్ మున్నారు కాపు సంఘం ఆధ్వర్యంలో బండారు పోసారు ,

ఈ సందర్బంగా అనాదిగా పెద్దల నుండి సంప్రదాయంగా వస్తున్నా ఆచారంలో భాగంగా పిల్లలు& పెద్దలు ఆరోగ్యంగా వుండాలని, పాడి పంటలు, పశు సంపద దిన దినా అభివృద్ధి చెందాలని, ఏ దృష్ట శక్తులు ప్రజలపై పడవద్దనీ ఆ మహా తల్లులను పసుపు కుక్కుమాలు చల్లీ కొబ్బరి కాయలు కొట్టి, కల్లు సాక పోసి, దున్నపోతు ను ఉరి మీద వదిలి పెట్టడం జరిగింది, మహా తల్లుల ఆశీర్వాదం కోరుకోవడం జరిగింది, ప్రజలందరూ సిరి సంపదలతో విలసిల్లలనీ ప్రతీ సంవత్సరం లాగానే ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగిందనీ సర్వసమాజ్ కమిటీ కో. కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్ తెలపడం జరిగింది,

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సుంకటి ప్రవీణ్, ఉపాధ్యక్షులు పట్లే వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి పాలంచ గంగాధర్, సంయుక్త కార్యదర్శి కోరడి గోపి, కోశాధికారి భైర గంగ శైలేందర్ మరియు పెద్దకాపులు కోరడి పెద్ద నర్సయ్య, కోటకింది నర్సయ్య, కోర్వ భూపాల్, భైర గంగ ప్రసాద్, మల్కాయ్ లక్ష్మినారాయణ మరియు కొత్మీర్ సతీష్, జానకంపేట్ అశోక్, రామాడ్గు బాలకిషన్, మల్కాయి సుదర్శన్, గంట పెద్ద నర్సయ్య, సుంకటి భూమన్న, మల్కాయ్ భోజన్న, కొరడి నడ్పి నర్సయ్య, ఆదే నర్సయ్య, నరాల చక్రధర్, బెల్లల్ నాగ భూషణ్, కొట్టె సాయిబాబా, సుంకటి రమేష్, మల్కాయి మహేందర్, భైర ప్రసాద్, అన్నారం జితేందర్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments