HomeCRIMEసైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి..

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి..

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు గురువారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఒకటవ ఫ్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సైబర్‌ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమని పేర్కొన్నారు. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌, ఇతర ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు.

ప్రజల బలహీనతలే సైబర్‌ నేరగాళ్ల బలంగా మారిందన్నారు. మారుతున్న టెక్నాలజీ, అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారని, అప్రమత్తంగా ఉంటేనే నష్టం జరగదన్నారు.

సైబర్‌ నేరగాళ్ల చేతిలో నష్టపోతే తక్షణం 1930లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీస్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments