HomeCRIMEయువకుడి ని కబళించిన బెట్టింగ్ భూతం కామారెడ్డిలో విషాదం..

యువకుడి ని కబళించిన బెట్టింగ్ భూతం కామారెడ్డిలో విషాదం..

బెట్టింగ్ భూతం మరో యువకుడి ని బలి తీసుకుంది బెట్టింగ్ లో భారీగా డబ్బు కోల్పయి అప్పుల పాలై న ఆ యువకుడు చివరికి చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో చర్చి వెనకాల ఉన్న పొదల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.మృతుడు అంకం క్రాంతి కుమార్ ( 40 ) గుర్తించారు.

పట్టణంలోని ఎమ్మార్ కాలనీ కి చెందిన క్రాంతి కుమార్‌కు భార్య లావణ్య, కుమార్తె సంయుక్త, కవల కుమారులు విఘ్నేష్, వినాయక్ ఉన్నారు. క్రాంతి కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ కి పాల్పడుతూ సుమారుగా 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు , అప్పుల బాధతో మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిసింది.

దీంతో అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక, విచారణ అనంతరం వెల్లడికానున్నాయని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments