యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం బిజెపి కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ బుధవారం నిజామాబాద్ లో కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించారు.
నిజామాబాద్ నగర బిజెపి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ కార్యాలయం ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు.
అప్పటికే కాంగ్రెస్ ఆఫీస్ వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు కాంగ్రెస్ కార్యాలయం కు సమీప దూరంలో అడ్డుకుని వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు రలించారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు.
