అత్యధిక శబ్దంతో పాటలు పెట్టి ఆటో నడిపిన వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు.
నిజామాబాద్ కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్య రాత్రి 3 గంటల సమయంలో రైల్వే స్టేషన్ పరిధిలో షేక్ ముజామిల్ అనేవ్యక్తి అత్యధిక శబ్దంతో పాటలు పెట్టి ఆటో నడిపాడు.
అక్కడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి రఘుపతి అదుపులోకి తీసుకొని బుదవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా వ్యక్తి కి ఒకరోజు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం ఇట్టి వ్యక్తిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు.
