HomeCRIMEమున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీఅభ్యర్థి ఆత్మహత్య

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీఅభ్యర్థి ఆత్మహత్య

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీఅభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా మక్తల్‌లో కలకలం రేపింది . ..

మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎస్టీలకు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీలు ముగ్గురు సొంత అన్నదమ్ములనే రంగంలోకి దించాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ నుండి మహదేవ్ (43), కాంగ్రెస్ నుంచి అతడి అన్న పోటీలో ఉండగా..

బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారి తమ్ముడు నామినేషన్ ఉపసంహరణ రోజున పోటీ నుంచి తప్పుకున్నాడు. పోటీలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.నిన్నటి నుంచి డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుండడంతో..

6వ వార్డులోనూ పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులు కోరినట్లుగా సమాచారం. తాను లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలను.. మిగతాది తన వల్ల కాదని సోమవారం పార్టీ శ్రేణులకు ఆయన తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో ఒత్తిడికి గురైన మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. మహదేవప్ప ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి కావడంతో ఆ వార్డులో ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments