బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే ప్రజాపోరుబాట అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
చలో వరంగల్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు చేసిన ఏర్పాట్ల గురించి చర్చించేందుకు శనివారం నిర్వహించినఆర్మూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూబీఆర్ ఎస్ ఆవిర్భావమే తెలంగాణ ద్రోహుల ఘోరపరాభవ మన్నారుకేసీఆర్ స్వరాష్ట్ర సాధన ప్రధాత, తెలంగాణ జాతిపిత అని ఆయన అభివర్ణించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ద్వారా ఇచ్చే తెలంగాణ ఆత్మగౌరవ పోరు పిలుపుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కకావికలం కాకతప్పదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.వరంగల్ సభలో గులాబీ బాస్ చేసే ఆలోచనాత్మక ఉపన్యాసంతో రేవంత్ సర్కారుకు శాశ్వత సన్యాసం తప్పదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల పుట్ట అని, అవినీతికర, అవకాశవాద, దివాలాకోరు పాలనని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ఇచ్చిన ఎన్నికల హామీలకు తూట్లు పొడిచారని, ఆరు గ్యారెంటీలకు సమాధి చేశారని, అసత్యాలు, మోసపూరిత పద్ధతులతో ప్రజలకు పదేపదే వెన్నుపోట్లు పొడుస్తున్నారని ఆయన ధ్వజ మెత్తారు.
రేవంత్ రెడ్డి అరాచకపాలనపై ఊరూవాడ అట్టుడు కుతున్నదన్నని, కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేసి తెలంగాణ చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోయేలా చేసేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తేనే తెలంగాణకు వెలుగులు వస్తాయన్నారు.ప్రతీ పల్లె మనోగతం మళ్లీ కారు, సారు, కేసీఆరేనని చెబుతోందన్నారు.
ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా కాంగ్రెస్ పోక, బీఆర్ఎస్ రాక ఖాయమన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కు అండగా నిలవాలని నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ ను హీరోగా నిలబెట్టడమేకాక బీజేపీ, కాంగ్రెస్ జీరోలను చేసి ఉప్పు పాతర వేస్తారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ జిల్లా నుంచి జనం కేసీఆర్ ఇచ్చిన తెలంగాణ ఆత్మగౌరవ పోరాట సందేశం అందుకొని ప్రభంజనంలా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయే వరంగల్ రజతోత్సహ సభకు విరగబడి బయలెల్లుతున్నారని ఆయన వెల్ల డించారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివెళ్లిన జనంతో వరంగల్ రజతోత్సహ సభాప్రాంగణం దద్దరిల్లాలని జీవన్ రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, కౌన్సిలర్లు లింబాద్రి గౌడ్, చక్రు, పోల సుధాకర్, రవి, నవీన్, మహేష్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
