ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
నిజామాబాద్ జిల్లాలో ఈ యాసంగి కాలంలో రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్నాయని పేర్కొన్నారు.అలాగే సాగుచేసిన పంటలకు తగిన సాగునీరు అందకపోవడం వల్ల, పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ పేర్కొన్నారు.
ఈ యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, అందులో 4.15 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగుచేశారు. కాలువల ద్వారా సాగునీరు అందుతున్న గ్రామాలతో పాటు మెట్ట ప్రాంతాల్లోనూ రైతులు బోర్ల ఆధారంగా వరి సాగు చేపట్టారు.
అయితే, కాలువల కింద ఉన్న పంటలకు సాగునీరు అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయనీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, డిచ్పల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలలో బోర్లు ఒకేసారి ఎత్తివేయడంతో రైతులు సాగుచేసిన వరిపంటలు ఎండిపోతున్నాయి.
ఈ పరిస్థితితో ఆర్థికంగా నష్టపోతూ, తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారనీ అన్నారు.
అందుకు మెట్ట ప్రాంతాల్లోని రైతులకు ట్యాంకర్ల ద్వారా సాగునీరు సరఫరా చేయాలని,కాలువల కింద ఉన్న పంటలకు తక్షణమే సాగునీరు అందించాలని. కోర్టుపంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరారు.
