HomeCRIMEనగరంలోని డ్రైనేజీలో మృతదేహం లభ్యం..

నగరంలోని డ్రైనేజీలో మృతదేహం లభ్యం..

నగరంలోని బోధన్ బస్టాండ్ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెనుక ఉన్న డ్రైనేజీలో ఓ మృతదేహం లభ్యం అయ్యింది. ఈ ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం అందుకున్న ఒకటవ టౌన్ పోలీసులు వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మృతుడు స్థానికంగా ఉండే గౌస్‌గా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. డ్రైనేజీలో మృతదేహం ఎలా పడిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు పూర్తిస్థాయి విచారణలో తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments