నీటి తొట్టెలో పడి బాలుడి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో ఈ విషాదం ఘటన చోటుచేసుకుంది.
గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో టీ పాయింట్ నడిపే కుమ్మరి రాజు రెండున్నరేళ్ల చిన్నకుమారుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు.
