నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సి డి పి ఓ డిచ్ పల్లి వారి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ..
9 నెలలు మోసి కన్న బిడ్డలను పెంచడంలో తల్లి పాత్ర ప్రముఖమైనదని ,తల్లిపాలలో అద్భుతమైన శక్తి ఉంటుందని, పుట్టిన బిడ్డకు వెంటనే స్తన్యం ఇవ్వడం చాలా అవసరమని తెలిపారు.
దీనిపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ దేశాలలో తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటారని తెలిపారు. తల్లిపాలు బిడ్డలకు పోషకాలను అందించడమే కాకుండా పసి వయసులో వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి స్వర్ణలత, కోఆర్డినేటర్ రంజిత్ ,అంగన్వాడీ టీచర్లు సురేఖ, శ్రీదేవి మరియు తదితరులు పాల్గొన్నారు.
