Saturday, April 26, 2025
HomeTelanganaNizamabadరుణమాఫీపై రైతుల్లో అయోమయం-ఎక్కువ శాతం మందికి దక్కని రుణమాఫీ-

రుణమాఫీపై రైతుల్లో అయోమయం-ఎక్కువ శాతం మందికి దక్కని రుణమాఫీ-

బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు-రేషన్ కార్డుల్లో పేరులేని రైతుల ఆందోళన-రైతుబంధుకు లేని షరతులు రుణమాఫీకి ఎందుకో?|-పాసుబుక్ రుణాలన్ని మాఫీ చేస్తామని చెప్పి కోర్రిలు-రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ బూటకమేనా?

జాన రమేష్: ఆర్మూర్ : ఇది సంగతి:

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పంటరుణాల మాఫీ రైతుల్లో తీవ్ర అయోమయం, ఆందోళనను కలిగిస్తోంది. రూ .2 లక్షల వరకు పంటరుణాల మాఫీ దేవుడెరుగు, కానీ మొదటి విడతగా ప్రకటించిన లక్షలోపు రుణమాఫీ 75 శాతం మంది రైతులకు లభించలేదంటే అతిశయోక్తి కాదు.

రెండవ విడత రుణమాఫీలో అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మాక్లూర్ సహకార సంఘంలో సీఈఓ ను రైతులు నిర్వహిస్తే, ఏకంగా రెంజల్ మండల కేంద్రంలో రుణమాఫీ పై ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్యాంకుకు తాళం వేసి రైతులు తమ అసహనాన్ని నిరసన ద్వారా తెలియజేశారు.

2018,2023 ఎన్నికల్లో రుణ మాఫీపై కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన, వరంగల్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రుణమాపీ ప్రకటన ఓట్ల కోసమేనా అన్న అనుమానం రైతుల్లో నెలకొంది. గత పదేళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తూ వస్తుండగా చాలామంది రైతులకు మాఫీ జరుగలేదు.

ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది మాఫీ అవుతదని రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకోలేదు. దీనిని ఎన్నికల వాగ్దానంలో చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నారు.

తీరా అధికారంలోకి వచ్చాక రుణాలు రెన్యూవల్ చేయించుకోని రైతులను డిఫాల్ట్ రైతులుగా చూపిస్తు వారికి మాఫీలో స్థానం కల్పించడం లేదు. రుణమాఫీకి ముఖ్యంగా రేషన్ కార్డును అర్హతగా చూపుతూ రుణమాఫీ చేసినట్లు తెలుస్తోంది.

రేషన్ కార్డు లేనివారు, కార్డు ఉన్నా అందులో పేరులేని రైతులు వేలాది మంది ఉన్నారు. అటువంటి వారందరికి రుణమాఫీ లభించక మనోవేధనకు గురవుతున్నారు. మరికొందరు రైతులకు ఆధార్ కార్డుకు, ఉన్న పేరుకు తేడా ఉండడం వల్ల రుణమాఫీ రాలేదని అ ధికారులు చెబుతున్నారు.

రైతుబంధు డబ్బులు. కేంద్రం పీఎం కిసాన్ డబ్బులను పదేళ్లుగా ఇస్తుండగా లేని అనుమానం ఇప్పుడే ఎందుకు వస్తోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు చాలామంది రైతులు గల్ఫ్ దేశాలు వెళ్ళినప్పుడు వారి పేర్లు రేషన్ కార్డులో తొలగించారు.

వారు ఇంటికి వచ్చిన తర్వాత వారి పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చలేదు. వారు కూడా ఇప్పుడు రుణమాఫీకి నోచుకోలేకపోతున్నారు. పాస్ బుక్ ద్వారా తీసుకున్న రూ .2 లక్షలలోపు రుణాలన్ని కచ్చితంగా మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యకం చేస్తున్నారు.

రుణమాఫీ రెతులు ఏఈవోల వద్ద పేరు నమోదు చేసుకోవాలని చెబుతున్నప్పటికీ, రుణమాఫీ రుణాల వివరాల కోసం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినప్పటికీ అవన్ని కంటితుడుపు చర్యలే తప్ప, మలి విడతలో రుణమాఫీ వస్తుందన్న గ్యారంటీ లేదని రైతులు వాపోతున్నారు.పాస్ బుక్ రుణాలన్ని మాఫీ చేయాలి:

దేగాం రాములు. రైతు అంక్సాపూర్.-కాంగ్రెస్ ప్రభుత్వం పంటరుణాల మాఫీపై ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి కట్టుబడి పాస్ బుక్ రుణాలన్ని మాఫీ చేయాలి.

2018, 2023 ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీ రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. పార్టీ అగ్రనేత చెప్పిన మాటపై నిలబడకుండా లేని పోని కొర్రీలు పెడుతున్నారు.

కేవలం రుణభారం తప్పించుకోడానికే కొర్రీలు పెడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేయాలి. లేకుంటే ప్రభుత్వానికి పుట్టగతులుండవు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!