నగరంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని నాలుగవ టౌన్ పోలీసులు పట్టుకున్నారు .ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.
నగరంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన శశాంక్(20)అనే యువకుడు న్యాల్కల్ రోడ్డు లో అష్టలక్ష్మి దేవాలయం సమీపంలో గంజాయి అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పట్టుకొని 220గ్రాముల ఎండు గంజాయి నీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు శశాంక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.