HomeTelanganaNizamabadస్థానిక సంస్థలు ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు ఖాయం..ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..

స్థానిక సంస్థలు ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు ఖాయం..ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.అలాగే స్థానిక సంస్థలు ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు ఖాయమని తెలిపారు.

సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా పాలన అస్తవ్యస్థంగా ఉందని అన్నారు.

అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో బాసర సరస్వతీ దేవి ,ఆర్మూర్ సిద్ధులగుట్ట మీద ఒట్టు చేసి అధికారంలోకి రాగానే రైతు రుణ మాఫీ చేస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రుణమాఫీ చేయలేదని తెలిపారు.

అలాగే జిల్లాలో 2 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని,అందుకే రైతులందరూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని అన్నారు.ఇక గ్రామాల్లో పాలన అస్తవ్యస్థంగా ఉందని తెలిపారు.

అలాగే మున్సిపాలిటీల్లో చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోయకుండా తుప్పు పడుతున్నాయని ఎద్దేవ చేశారు.ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఇంచార్జి లు గ్రామాల్లో తిరిగే పరిస్థితులు లేవన్నారు.

టిఆర్ఎస్ హయంలో ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి నిర్మించి 400 పైగా ప్రసూతిలు జరిగేవని,కానీ ప్రస్తుతం 30 కూడా కావడంలేదని అన్నారు.రేవంత్ పాలన పై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారన్నారు.

ఇచిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని అన్నారు.ఆరు గ్యారెంటీలు గాలికి వదిలేశారని అన్నారు.జిల్లాకు మంత్రి పదవే దిక్కు లేదని ఆగ్రహించారు. ఇంచార్జి మంత్రులతో పాలన వ్యవహారాలు నడుపుతున్నాయని అన్నారు.

జిల్లాకు చెందిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు అయిన ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఇందిరమ్మ ఇండ్లకు, ఒకరు ఇంచార్జి,ఇసుక కు మరొకరు,మట్టికి ఒకరు ఇలా ప్రతి దానిలో ఇంచార్జి లను ఏర్పాటు చేసి అధికారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇక నుంచి ప్రతి మండల అధ్యక్షులతో కలసి స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.

అలాగే జిల్లాకు కెటిఆర్ ను పిలిపిస్తామని అన్నారు.అలాగే ఈసందర్భంగా పలువురు యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments