HomeDevotionalశ్రీ సంతోషిమాత సాయిబాబా దేవస్థానంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

శ్రీ సంతోషిమాత సాయిబాబా దేవస్థానంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

నగరంలోని శ్రీ సంతోషిమాత సాయిబాబా దేవస్థానంలో నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరగింది.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌గా గంగా కిషన్ ప్రమాణం చేశారు. డైరెక్టర్‌గా గాద ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించగా, బోనాల శివలింగం, శాంతాబాయి, శ్రీనివాస్ తదితర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ, ప్రముఖ కాంగ్రెస్ నేత తహర్ బాయ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ కేశవ వేణు, గడువు గంగాధర్, రత్నాకర్, నగేష్ రెడ్డి, మానాల మోహన్ హాజరై కమిటీకి అభినందనలు తెలిపారు.

పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments