నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ,శంభుని గుడి,శ్రీ సంతోషిమాత,సాయిబాబా దేవాలయ నూతన కమిటీలు ప్రమాణ స్వీకారం చేశారు.
మహోత్సవంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని నూతన చైర్మన్ పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
శ్రీ జెండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మన్ గా లవంగ ప్రమోద్ కుమార్, డైరెక్టర్లుగా పాలకొండ నర్సింగరావు, సిరిపురం కిరణ్ కుమార్, వేముల దేవిదాస్, మంత లక్ష్మణ్, పవర్ విజయ, కోరవ రాజ్ కుమార్, అలాగే శంభుని గుడి ఆలయ కమిటీ చైర్మన్గా, బింగి మధు, డైరెక్టర్లుగా,గాజుల కిషోర్,గాండ్ల సంతోష్ కుమార్, కమల్ కిషోర్ దయ్మా ,మామిడి శేఖర్ ,ఉప్పల రమేష్,గోపు రేఖ, శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ గా బొత్కం గంగా కిషన్, డైరెక్టర్లుగా శ్రీ రాం రమేష్ ,గాదె ప్రవీణ్ కుమార్, బాణాల శివ లింగం, కోల్తే శాంతా బాయ్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. జెండా బాలాజీ,శంభుని గుడి, శ్రీ సంతోషిమాత సాయిబాబాఆలయాలు చాలా పురాతన మైనవి మరియు మహిమలు గలవని అన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని స్వామి వారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ ఆకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్ ,గ్రంధాలయ చైర్మన్ రాజి రెడ్డి , నూడా చైర్మన్ కేశ వేణు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
