HomeTelanganaNizamabadచరిత్రలో నిలిచేలా బీఆర్ఎస్ రజతోత్సహం -తెలంగాణ సబ్బండ వర్గాల చూపు వరంగల్ సభ వైపు-గులాబీ పండుగ...

చరిత్రలో నిలిచేలా బీఆర్ఎస్ రజతోత్సహం -తెలంగాణ సబ్బండ వర్గాల చూపు వరంగల్ సభ వైపు-గులాబీ పండుగ జనజాతర

తెలంగాణ ద్రోహులకు పాతర -స్వరాష్ట్ర తెలంగాణ ‘గులాబీ’ మాగాణ-గులాబీ జెండా ప్రజల ఆకాంక్షలు తీర్చే ఎజెండా-బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ-బీజేపీ, కాంగ్రెస్ లు పరాయి పార్టీలు-కాంగ్రెస్, బీజేపీలది తెలంగాణ సంపద ను దోచుకునే ఎత్తుగడ-ప్రజలకు ప్రాణ సంకటంగా రేవంత్ సర్కారు విధానాలు-కాంగ్రెస్ రాక్షస పాలనపై వరంగల్ సభ యుద్ధభేరి-కాంగ్రెస్ అవినీతి చీడను, బీజేపీ మతోన్మాద పీడను వదిలిస్తాం-మళ్లీ కేసీఆర్ తోనే అభివృద్ధి, సంక్షేమ రాజ్యం_ఇందూరు పంతం కాంగ్రెస్, బీజేపీల అంతం-కేసీఆర్ కు అండగా కదం తొక్కుతున్న ఊరూవాడ_నిజామాబాద్ జిల్లా నుంచి వరంగల్ కు జన ప్రభంజనం-గ్రామగ్రామాన ముమ్మరంగా ఏర్పాట్లు -పల్లెపల్లెన గులాబీ జెండా ఎగరేస్తాం, వరంగల్ వైపు అడుగేస్తాం-బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి-‘చలో వరంగల్ ‘ కార్యక్రమంపై ఆర్మూర్ , బోధన్, నిజామాబాద్ అర్బన్, రూరల్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష_సభకు ఆహ్వాని స్తూ ఆర్మూర్ లో గోడలపై స్టిక్కర్లు అంటించిన జీవన్ రెడ్డి -రేవంత్ గోబ్యాక్-కేసీఆర్ కమ్ బ్యాక్’ అని గోడరాతలు_ ప్రజాస్పందన చూసి నిర్ఘాంత పోతున్న నిఘావర్గాలు

నిజామాబాద్, ఏప్రిల్25:-

దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచేలా బీఆర్ఎస్ రజతోత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తు న్నామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.

‘చలో వరంగల్ ‘ కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం జరిగిన ఆర్మూర్ , నిజామాబాద్ అర్బన్, రూరల్ , బోధన్ నియోజక వర్గాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల చూపు వరంగల్ సభ వైపే ఉందన్నారు.

అంగరంగ వైభవంగా జరగనున్న గులాబీ పండుగ జనజాతర తెలంగాణ ద్రోహులకు పాత రేస్తుందని ఆయన అన్నారు. స్వరాష్ట్ర తెలంగాణ ‘గులాబీ’ వనం విరాజిల్లుతున్న మాగాణ అని, గులాబీ జెండా ప్రజల ఆకాంక్షలు తీర్చే ఎజెండా అని ఆయన అభి వర్ణించారు.

బీఆర్ఎస్ అసలుసిసలైన తెలంగాణ ఇంటి పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లు తెలంగాణ సోయిలేని పరాయి పార్టీలని జీవన్ రెడ్డి మండిపడ్డారు.తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో బీఆర్ఎస్ తెలంగాణ రక్షణ కవచమన్నారు.

కాంగ్రెస్, బీజేపీలది తెలంగాణ సంపద ను దోచుకునే ఎత్తుగడ తప్ప మేలుచేసే గుణం లేదని ఆయన ధ్వజమెత్తారు.

రేవంత్ సర్కారు సాగిస్తున్న దగాకోరు విధానాలు తెలంగాణ ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాక్షస పాలనపై వరంగల్ సభ యుద్ధభేరిమోగిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని శనిలా పట్టిన కాంగ్రెస్ అవినీతి చీడను, బీజేపీ మతోన్మాద పీడను వదిలించ డానికి వరంగల్ సభ నాంది పలుకు తుందన్నారు

మళ్లీ కేసీఆర్ తోనే అభివృద్ధి, సంక్షేమ రాజ్యం వస్తుందని, ఆయనను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చూసేందుకు ‘రేవంత్ గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్’ అనే నినాదంతో పనిచేస్తా మన్నారు. ‘ఆర్మూర్ ప్రజల పంతం నియోజకవర్గంలో అవినీతి కాంగ్రెస్, అరాచక బీజేపీల అంతం’ అని పోరాట కార్యాచరణను రూపొందించు కొని పోరాడదామని ఆర్మూర్ నేతలతో అ న్నారు.

ఇందూరు జిల్లా పంతం- ఇందిరమ్మ హింసా రాజ్యం అంతం అన్న దీక్షతో పని చేసి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని నిరూపిస్తామన్నారు. కేసీఆర్ కు అండగా వరంగల్ సభకు ఊరూవాడ కదం తొక్కుతున్న దన్నారు.

నిజామాబాద్ జిల్లా నుంచి జనం వరంగల్ కు ప్రభంజనంలా తరలి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని జీవన్ రెడ్డి తెలిపారు.అన్ని గ్రామాల్లో పార్టీ జెండా గద్దెల నిర్మాణం, పోస్టర్ల విడుదల, గోడలపై రాతలు, పార్టీ జెండాల ఆవిష్కరణలతో పార్టీ శ్రేణులు వరంగల్ సభ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు ఎక్కడ చూసినా ఏప్రిల్‌ 27న ఎల్కతుర్తిలో జరిగే తెలంగాణ ఇంటి పార్టీ రజతోత్సవ వేడుకల గురించే చర్చ జరుగుతున్న దన్నారు.

సభకు వచ్చేవారికి కనీస వసతులు కల్పిస్తున్నాం. మంచినీళ్ల బాటిళ్లను మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేశాం. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ లు, కార్పొరేషన్, మున్సిపల్ వార్డులలో గులాబీ జెండా ఎగరేస్తాం, వరంగల్ వైపు అడుగేస్తాం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

సభకు ఆహ్వానిస్తూ గోడలపై స్టిక్కర్లు అంటించిన జీవన్ రెడ్డి -రేవంత్ గోబ్యాక్-కేసీఆర్ కమ్ బ్యాక్ అని గోడరాతలువరంగల్ లో ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఆహ్వానిస్తూ ఆర్మూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి శుక్రవారం స్టిక్కర్లు అంటించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆయన వాల్ పెయింటింగ్ కూడా వేశారు.

ముఖ్యంగా ‘రేవంత్ గోబ్యాక్-కేసీఆర్ కమ్ బ్యాక్ ‘అని గోడరాతలు రాసి బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు ఇంటికొక్కరు తరలి రావాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్పందన చూసి నిర్ఘాంత పోతున్న నిఘావర్గాలు బీఆర్‌ఎస్‌ సభ కోసం ఎంత మంది తరలివెళ్తున్నారనే విషయమై ఆరా తీస్తున్న నిఘావర్గాలే ప్రజాస్పందన చూసి నిర్ఘాంత పోతున్నాయి. గ్రామాలవారీగా ప్రతీ రోజు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ సభకు సంబంధించిన లెక్కలు తెప్పించు కుంటున్నట్టు తెలిసింది.

సభకు ఎంత మంది వెళ్లవచ్చన్న అంచనా ఇవ్వాలని ప్రభుత్వ నిఘా విభాగం ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి ఎన్ని బస్సులు, ఎన్ని కార్లు సభ కోసం సిద్ధమవు తున్నాయి? ఎంత మంది వెళ్లే అవకాశం ఉన్నది? అంటూ ఆరా తీస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఏం నివేదికలు ఇవ్వాలో నిఘావర్గాలకు బోధ పడటం లేదని తెలిసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments