బర్రె తెచ్చిన పంచాయతీలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఈ ఘటన మోపాల్ మండలంలోని సింగంపల్లి లో చోటు చేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం..
మోపాల్ మండలంలోని సింగంపల్లి కి చెందిన సవిత పై గంగారం చెట్టుకు కట్టేసి దాడి చేసినట్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు .గంగారం కు చెందిన బర్రె సవిత ఇంటి వద్ద మలవిసర్జన చేస్తుందని ఈ విషయం గంగారంకు పలు మార్లు తెలిపిన పట్టించుకోవడం లేదని బుదవారం సవిత ఆ బర్రెను చెట్టుకు కట్టేసినట్లు తెలిపారు.
ఈ మేరకు గంగారం ఆగ్రహించి సవితను చెట్టుకు కట్టేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సవిత బుదవారం సాయంత్రం మోపాల్ పోలీసుస్టేషన్ కు వెళ్లగా వెళ్ళింది.
అక్కడ ఉన్న సిబ్బంది కాసేపు వేచి ఉండమని తెలపడంతో మళ్ళీ వస్తానని చెప్పి గురువారం నేరుగా పోలీస్ కమిషనర్ ను కలిసినట్లు సమాచారం. ఈ మేరకు మోపాల్ ఎస్ఐ స్పందించి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
