HomeHEALTHజీజీహెచ్ లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ప్రారంభం..

జీజీహెచ్ లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ప్రారంభం..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.

ఈ సెంటర్ ఏర్పాటు లక్ష్యం క్యాన్సర్ రోగులకు పగటి సమయంలోనే చికిత్స అందించడం. ఇప్పటివరకు ఎంజెఎన్‌జె ఆసుపత్రిలో మొదటి డోస్ చికిత్స పొందిన రోగులు ఇకపై రెండో డోస్ నుండి నిజామాబాద్‌లోని డే కేర్ సెంటర్‌లోనే చికిత్స పొందవచ్చనీ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

దీని ద్వారా నిజామాబాద్ పరిసర ప్రాంతాల రోగులకు పెద్ద ఎత్తున ఉపయోగం కలుగుతుంది. హైదరాబాదుకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే సమయానికి చికిత్స పొందే అవకాశం లభిస్తుందనీ పేర్కొన్నారు.

అలాగే, క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు డే కేర్ క్యాన్సర్ సెంటర్‌లో సరఫరా చేయబడి అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments