కరీంనగర్ జిల్లాలో ఘోర శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన ఘటన లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు ఈ ప్రమాదం కరీంనగర్ జిల్లా శంకర్ పట్నం మండలం తాడి కాల్ శివారు లో జరిగింది
నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖకు చెందిన ఐదుగురు సిబ్బంది కారులో నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నారు తాడికల్ గ్రామ శివారుకు చేరుకోగానే రహదారి పక్కన ఆగి ఉన్న లారీని కారు వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది.
దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతుల్లో నిజామాబాద్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న శేఖర్, విశ్వేశ్వరరావు, పర్షిగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్, మురళిని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
