పార్టీ మారిన ఎమ్మెల్యే లకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది.ఆయన బిఆర్ యస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద ఎమ్మెల్యే గా 2023 లో గెలిచారు కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసారు.
పార్టీ మార్చిన దానం మీద అనర్హత వేటు వెయ్యాలని బిఆర్ యస్ స్పీకర్ కు పిర్యాదు చేసింది కానీ అయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పెండింగ్ లో పెట్టారు దీనితో బిఆర్ యస్ నేతలు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు
నిర్ణిత గడువులోగ నిర్ణయం ప్రకటించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది దీనితో దానం ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదని ఆయన ను అనర్హత కింది కి రారని స్పీకర్ ఆదేశాలుఇచ్చారు స్పీకర్ ఆదేశాలను బిఆర్ యస్ హైకోర్టు లో ఛాలెంజ్ చేసింది ఆయన 2024 నుంచి అనర్హత వుంటుందని స్పీకర్ వైఖరి కరెక్ట్ కాదని హైకోర్టు పేర్కొంది
