హైదరాబాద్ వనస్థలిపురంలోశుక్రవారం తెల్లవారుజామునపాల వ్యాపారి దారుణంహత్యకు గురయ్యారు బస్టాండ్ సమీపంలో పాల వ్యాపారి భుజంగరావు (60)ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు.
గుర్రంగూడలో ఉండే భుజంగరావు పాల వ్యాపారం చేస్తుండగా.. ఆయన ఇంటి పక్కనే ఉండే శివేందర్ సింగ్ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు.
వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న భుజంగరావు పాలు తీసుకెళ్తుండగా శివేందర్ సింగ్ కత్తితో దాడి చేశాడు. అనంతరం శివేందర్ సింగ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు
