HomeCRIMEఅక్రమ మొరం తవ్వకాలపై ‘సీసీఎస్’ ఉక్కుపాదం..నందిపేటలో వాహనాల స్వాధీనం..

అక్రమ మొరం తవ్వకాలపై ‘సీసీఎస్’ ఉక్కుపాదం..నందిపేటలో వాహనాల స్వాధీనం..

జిల్లాలో అనుమతి లేకుండా సాగుతున్న అక్రమ మొరం తవ్వకాలపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శసాయి చైతన్య ఉత్తర్వుల మేరకు సీసీఎస్ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు.

నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుగుట్ట వెనుక భాగంలో పెద్ద ఎత్తున మొరం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.

పోలీసుల రాకను గమనించిన నిందితులు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి తవ్వకాలకు ఉపయోగిస్తున్న యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడిలో, 3 టిప్పర్లు, 2 జేసీబీలు,1 ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నందిపేట ఎస్హెచ్‌ఓకు అప్పగించారు.

కఠిన చర్యలు తప్పవు: సీపీ


“ప్రభుత్వ సంపదను కొల్లగొడుతూ అక్రమ తవ్వకాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. అనుమతులు లేకుండా మొరం, ఇసుక తవ్వకాలు జరిపేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. నిరంతరం నిఘా కొనసాగుతుందనీ cp సాయి చైతన్య హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments