HomeTelanganaNizamabadయువత ఫోన్లో కాకుండా మైదానంలో గడపాలి.. ప్రభుత్వాలకు ధీటుగా క్రికెట్ మైదానాన్ని నెలకొల్పడం అభినందనీయం...

యువత ఫోన్లో కాకుండా మైదానంలో గడపాలి.. ప్రభుత్వాలకు ధీటుగా క్రికెట్ మైదానాన్ని నెలకొల్పడం అభినందనీయం…

కేశాపూర్ లో గ్రౌండ్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…ఇందూరు: యువత తమ సమయాన్ని ఫోన్లో కాకుండా మైదానంలో గడపాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త తెలిపారు.

కేశాపూర్ లో వైద్యులు అభినవ్, కిరణ్ కుమార్, చైతన్య కుమార్, ప్రశాంత్ రెడ్డి లు ఏర్పాటు చేసిన రాకెట్స్ క్రికెట్ గ్రౌండ్ ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కేవలం వైద్యమే కాకుండా యువత కోసం క్రికెట్ మైదానాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

అయితే ఆశించిన స్థాయిలో సౌకర్యాలు లేకవడం క్రీడాకారులకు శాపంగా మారిందనన్నారు. జిల్లాలో ఎటువంటి సౌకర్యాలు లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో ఆయా క్రీడా అంశాల్లో రాణిస్తున్న క్రీడాకారులు ఎందరో ఉన్నారన్నారు.

ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ…జిల్లాలో మాత్రం స్టేడియం లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే తాను స్టేడియం విషయం అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. అలాగే యువత డ్రగ్స్, మద్యం వైపు కాకుండా క్రీడల వైపు దృష్టి సారించాలన్నారు.

అలాగే అన్ని పార్టీల నాయకులు కలిసి కట్టుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, నగర మేయర్ ఉమారాణి, డీసీ పీ బస్వారెడ్డి, కేశాపూర్ సర్పంచ్ గంగాధర్, డాక్టర్ మోతీలాల్, బీజేపీ కార్పొరేటర్ లు మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments