నగరంలో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడి చేసి 9 మందిని పట్టుకున్నట్లు తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే నగరంలోని ఐదవ టౌన్ పరిధిలోనీ లలిత నగర్ బస్ డిపో సమీపంలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సిసిఎస్ పోలీసులు దాడి నిర్వహించి తొమ్మిది మంది అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి రూ 14,800 నగదు స్వాధీనం చేసుకున్నారు.వారిని స్థానిక ఐదవ టౌన్ పోలీసులకు అప్పగించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
