Monday, April 27, 2026
HomeCRIMEఆటోల చోరి ముఠా గుట్టురట్టు..నలుగురు అరెస్ట్..ముగ్గురు పరారీ

ఆటోల చోరి ముఠా గుట్టురట్టు..నలుగురు అరెస్ట్..ముగ్గురు పరారీ

ఆటోలు,ద్విచక్ర వాహనాల చోరి ముఠా గుట్టును సెంట్రల్ క్రైమ్ సెంటర్ (సీసీఎస్) పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆటోలు ద్విచక్ర వాహనాల చోరి చేస్తున్న ఇద్దరిని,కొనుగోలు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి 9 ఆటోలు,3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.

గురువారం జిల్లా కేంద్రంలోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లా ఆటో నగర్ కు చెందిన షేక్ ఫజిల్,అలాగే మహమ్మద్ నవాజ్,షేక్ అలీ, అలీం, వహీద్ లు ఓ ముఠా గా ఏర్పడి జిల్లాలోని పలు ప్రాంతంలో ఆటో, ద్విచక్ర వాహనాలను చోరి వాహనాల ఇంజన్ నెంబర్, చాసిస్ నంబర్ లను చెరిపేసి జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన మహమ్మద్ ఇమ్రాన్,మహమ్మద్ ఇలియాస్ లకు అమ్మెవారని తెలిపారు.

ఈ మేరకు వీరిపై ఆరవ టౌన్, బోధన్,ఆర్మూర్, ముధోల్ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ మేరకు సీసీఎస్ ఏసిపి నాగేంద్ర చారి ఆద్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తులో షేక్ ఫజిల్, మహమ్మద్ నవాజ్ లను పట్టుకున్నట్లు తెలిపారు.

దీంతో షేక్ ఫజిల్, మహమ్మద్ నవాజ్ లను విచారించగా ,షేక్ అలీ, అలీం, వహీద్ అందరం కలిసి ఓ ముఠా గా ఏర్పడి జిల్లాలోని ఆటో, ద్విచక్ర వాహనాలను చోరి చేస్తున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు.

ఈ మేరకు వీరు చోరి చేసిన ఆటో, ద్విచక్ర వాహనాలు బోధన్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో దాచిపెట్టి జగిత్యాలకు వెళ్లి అక్కడ అమ్మేవారనీ తెలిపారు.

దీంతో బోధన్ వెళ్ళి అక్కడ నుంచి 9 ఆటో లను,3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.దీంతో ఈ చోరి ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎవరైనా తక్కువ ధరకు వాహనాన్ని అమ్మడానికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించలాని కోరారు. వీరిని పట్టుకోవడంలో సీసీఎస్ ఏసిపి నాగేంద్ర చారి, ఇన్స్పెక్టర్లు సాయి నాథ్, సురేష్, ఎస్ఐ గోవింద్,సిబ్బంది రాములు,వెంకట్రాం,రవి కృష్ణ,ప్రమోద్, నరేష్ లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!