నిజామాబాద్ లోని మహమ్మదీయ కాలనీకి చెందిన దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..
ఇటీవల అక్టోబర్ 6 న నిజామాబాద్ లోని మహమ్మదీయ కాలనీకి చెందిన మహమ్మద్ సాబిర్ పాష ఇంట్లో తేదీ అక్టోబర్ 6 న నాడు గుర్తు తెలియని దొంగలు చొరబడి ఇంట్లో గల రెండు తులాల బంగారు ఉంగరాలు మరియు 7 లక్షల రూపాయలు దొంగిలించుకుని పోయినారని ఫిర్యాదు మేరకు నిజామాబాద్ టౌన్-2 పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
దీంతో సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ నిజామాబాద్ ఆధ్వర్యంలో కేసు ధర్యాప్తులో భాగములో గురువారం ఫిర్యాదిదారుడి యొక్క అన్న అయిన మహమ్మద్ షఫీ పాషా @ జాకీర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అతని చేతిలో డబ్బులు లేక ఆర్థిక సమస్యలతో ఫిర్యాదిదారుడి ఇంట్లో గల రెండు తులాల బంగారు ఉంగరాలు మరియు 7 లక్షల రూపాయలు దొంగతనం చేసినానని ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ మేరకు మహమ్మద్ షఫీ పాషా @ జాకీర్ వద్ద నుండి 7,90,000/- రూపాయలు స్వాధీనం చేసుకుని నిందితుడుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
