మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పలితాలు వెలబడక ముందే గెలుపు అంచనాలకు వచ్చేస్తున్నాయి.బుధవారం పోలింగ్ జరిగింది. ఏ పార్టీ కి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని పోలింగ్ సరళి తో అంచనాకు వచ్చిన పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి.
నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ బీమ్ గల్ బోధన్ పాటు నిజామాబాదు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బిఆర్ యస్ కాంగ్రెస్ లు హోరాహోరీగా తలపడ్డాయి. శుక్రవారం ఎన్నికల ఫలితాలు రానున్నాయి .
ఫలితాలు వెలబడ్డాక మేయర్ ఛైర్మెన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మెజార్టీ స్థానాలు దక్కని పక్షం లో ప్రధాన పార్టీలు గెలిచిన ఇతర పార్టీ అభ్యర్థులను తమ వైపు లాక్కునే ఛాన్స్ ఉంది అందుకే ఫలితాలు రాక ముందే అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి తమ అభ్యర్థులెవరూ చేజారకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలను తెరలేపియ .
ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పాటు తమకు అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసిన తమ అభ్యర్థులందరిని శిబిరాలకు తరలిస్తున్నాయి.
జిల్లాలో క్యాంపు రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి.
బీఆర్ఎస్ సైతం అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ సూచన మేరకు అభ్యర్థులు సైతం తమ లగేజ్ ని సర్దుకుని క్యాంపుల బాట పడుతున్నారు. వీరినందరిని హైదరాబాద్ శివారులలోని ఫామ్ హౌస్‍లోల ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర స్థాయి నేతలతో మంతనాలు జరిపేందుకు వీలుగా రాజధాని శివారు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.ఉన్నపలంగా క్యాంప్ లకు వెళ్తున్న అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ ల కు సంబందించి పక్రియ ను పార్టీ నేతలకు అప్పగించి వెళ్తున్నారు
