ఎన్నికల్లో వోటర్ల ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం కొట్టాడు రూపాయలు వెచ్చిస్తారు. వోట్లు వేయాలని యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేస్తుంది.
విద్యావంతులు మేధావులు ….వృత్తి నిపుణులు సంపన్నులు వుండే నిజామాబాద్ నగరం లో ఎప్పటిలాగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ 60 శాతం కూడా దాటలేదు దాదాపు లక్షన్నర మంది ఈసారి ఓట్లయ్యేలేదు. అరకొర సౌకర్యాలుండే గ్రామీణ ప్రాంతాల్లో మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 75 శాతం మేరకు పోలింగ్ జరిగింది.
జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే దాదాపు 70 శాతం మేరకు పోలింగ్ జరిగింది. కానీ అడుగుకో పోలింగ్ కేంద్రం ఏర్పాటైన నిజామాబాద్ నగరంలో వోటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి వెనుకాడరు. నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 59.12 శాతం పోలింగ్ నమోదు అయింది.
ఇందులో 59 శాతం మహిళలు వోట్లు వేస్తె 58 శాతం పురుషులు వోట్లు వేశారు. నిజానికి నగరంలో విస్తృతమైన ఏర్పట్లు పటిష్టమైన పోలీసులు పహారా లు వుంటాయి అయినా నగర వోటర్లు నాలుగడుగులు వేసి వోట్లు వెయ్యడానికి బద్ధకం.
వోట్ల వెయ్యడానికి వెళ్తారనే ప్రైవేట్ సంస్థలు… బ్యాంకులు వ్యాపారసంస్థలు తమ కార్యకలాపాలు ఆపేస్తాయి అయినా సరే నగరంలో క్రమేపీ ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తుంది లోకసభ అసెంబ్లీ ఏ ఎన్నికలైన సరే నగరం లో వోటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి ససేమిరా అంటున్నారు.
నిజానికి ఒక్క పోలింగ్ కేంద్రం ఏర్పటు నిర్వహణ వెనుక వ్యయం కాదు కఠోర శ్రమ కూడా వుంటుంది ఇవేవి చదువుకున్న అర్బన్ వోటర్ల నెత్తి కెక్కడం లేదు. నిన్నటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గణాంకాలు చేస్తే అర్బన్ వోటర్ల వైఖరి ఆందోళన కలిగిస్తుంది.
ఆర్మూర్ లో 68 బోధన్ లో 68 బీమ్ గల్ లో 69 శాతం పోలింగ్ జరిగింది కానీ నగరంలో జస్ట్ 59 శాతమే నగరంలో 3.48 లక్షల ఓటర్లు వుంటే కేవలం 2.05 లక్షల మందే ఓట్లేశారు. అంటే దాదాపుగా లక్షన్నర మంది ఓట్లెయ్యలేదు.
నిజానికి నగరం అభివృద్ధి ని ప్రామాణికంగా భావించే వారికి మున్సిపల్ ఎన్నికలు అత్యంత ప్రదానం గల్లీ లో మురికి కాల్వలు …రోడ్లు తాగునీరు …చెత్త చెదారం…. లైట్లు పార్క్ ల నిర్వహణ లాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపేది కార్పొరేటర్ ! కానీ అలాంటి కార్పొరేటర్ ను ఎన్నుకునే విషయంలో మాత్రం వోటర్లు నిర్లిప్తంగా వుండడం ఆక్షేపణీయమే కదా .
