పార్టీ అధికారంలోకి వచ్చిన ఈఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో సమరోత్సాహం కనిపిస్తుంది.ఎట్టకేలకు స్థానిక ఎన్నికల కోసం పార్టీ అధిష్ఠానం సమాయత్తం అవుతున్న నేపథ్యంలో శుక్రవారం హైదారాబాద్ లో తలపెట్టిన కార్యకర్తల సమ్మేళనం సర్వత్రా ఆసక్తిగా మారింది.
పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు క్రియాశీలా కార్యకర్తలు పాల్గొన బోతున్న ఈ సమ్మేళన కు పార్టీ జాతీయ అధ్యక్షుడే హాజరు కాబోతున్నారు. కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్ లాంటి దిగ్గజ నేతలు ఈపాటికే హైదారాబాద్ కు వచ్చేసారు.
పీసీసీ సైతం ఎల్బీ స్టేడియం లో ఈ సమ్మేళనం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఆయా గ్రామాల నుంచి పార్టీ అధ్యకుడు తో పాటు ఐదుగురికి మించకుండా ముఖ్య కార్యకర్త లను హైద్రాబాద్ కు తరలించే బాధ్యతలను ఎమ్మెల్యే లు నియోజకవర్గ ఇంచార్జ్ లకు అప్పగించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ లో ఉత్సహం ఉరకలేస్తుంది. ఈ ఎన్నికలను సైతం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి క్యాడర్ కు ఈ సమ్మేళనం లో దిశానిర్దేశం చేయబోతున్నారు.
ఆరు గ్యారెంటీ లు అమలు చేయడంతో పాటు బిసి లకు 42 శాతం రిజర్వేషన్ లు ఇవ్వడానికి సిద్ధం అవుతున్న తరుణంలో స్థానిక ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది.పదేళ్లు అధికారం కు దూరం అయిన కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో సంస్థ గతంగా దెబ్బ తింది.
బలమైన క్యాడర్ ను కోల్పోయింది. ద్వితీయ శ్రేణి నేతలు అధికార యావ తో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకిలోకి వచ్చేసారు. కానీ బూతు స్థాయిలో పనిచేసే కార్యకర్తలు గ్రామ స్థాయి నేతలు ఇంకా పార్టీకి దూరంగా ఉన్నారు.
అందుకే పార్టీ ని మునపటి లా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలంటే స్థానిక ఎన్నికల్లో సత్త చాటడం అనివార్యంగా మారింది. వార్డు మెంబర్ సర్పంచ్ యంపిటిసి సహకార సంఘం డైరెక్టర్ ఛైర్మెన్ లాంటి పదవులను దక్కించుకోవాలని అప్పుడే పార్టీకి పూర్వ వైభవం దక్కే ఛాన్స్ ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 కైవసం చేసుకుంటామని బడాయిలు చెప్తున్న కాంగ్రెస్ నేతలు కనీసం 60 శాతం గెల్చిన పార్టీ గ్రామ స్థాయి లో పటిష్టం అయ్యే పరిస్థితి వుంటుంది. కానీ ఓ ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యే లు ఇద్దరు ఎమ్మెల్సీ లున్న బీజేపీ ఈపాటికే జిల్లాలో బలంగా ఉంది లోకల్ బాడీ ఎన్నికలను ఈసారి బీజేపీ సైతం సీరియస్ గా తీసుకోబోతుంది.
అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో జిల్లాలో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. అందుకే స్థానిక ఎన్నికలో ఏక పక్ష ఫలితాలు అనుకున్నంత సుళువేమీ కాదు.
కానీ ప్రతికూల పరిస్థితులను అధిగమించి పార్టీ లో కొనసాగుతున్న కిందిస్థాయి క్యాడర్ కు అధికార అందలం దక్కాలంటే ఈ ఎన్నికల్లో గెలవడం కోసం అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డాలి.
ఇప్పటిదాకా వచ్చిన నామినేటెడ్ పదవులు ద్వితీయ శ్రేణి నేతలకు సైతం దక్కలేదు కేవలం టికెట్ దక్కని నేతలకు మాత్రమే ఆ పదవులు వచ్చాయి.
కానీ కార్యకర్తలకు స్థానిక ఎన్నికలే దిక్కు అందుకే సానుకూల ఫలితాలు వచ్చేలా చేయడం అనివార్యంగా మారింది.సానుకూల పలితాలు రాకపోతే కార్యకర్తలకు ఏ పదవీ లేక నిస్సహాయులు అవుతారు.
