ఛత్తీస్ ఘడ్ కు ఇద్దరు మావోయిస్టు నక్సలైట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరుమావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరాలను ఆమె వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ లుగా ఆమె పేర్కొన్నారు.
గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ 2022 హెడ్మా నాయకత్వంలో సీపీఐ మావోయిస్టు పీఎల్జీ ఏ ఫస్ట్ బెటాలియన్ లో పార్టీ మెంబర్ గా చేరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీకి కావలసిన వస్తువులను సరఫరా చేసేవాడని ఇలా రెండు సంవత్సరాలు సీపీఐ మావోయిస్టు పార్టీలో సప్లై టీ మెంబర్ గా పని చేశాడని 2024లో అతన్ని టెక్నికల్ టీం మెంబర్ గా తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నుండి అతను అజ్ఞాతంలోకి వెళ్లి బెటాలియన్లు టెక్నికల్ టీం మెంబర్ గా కొనసాగినట్లు పేర్కొన్నారు.
ఇతను 2024 జూన్ లో పుసుగుప్ప సీఆర్పీఎఫ్ క్యాంపు పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటన . 2024 జూలై లో జమ్మి గూడా లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు .
సెప్టెంబర్ 2024 లో గుండ్రాజు గూడెం లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు . 2024 డిసెంబర్ లో పాలగూడ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు.
2025 జనవరిలో తమ్బెల్ బట్టి లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎన్ని మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు. జనవరి 2025 తుమారెల్ లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయినట్లు చెప్పారు. 2025 జనవరిలో మల్లంపేట లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అందరూ తప్పించుకున్నారన్నారు.
2025 ఫిబ్రవరిలో పెద్ద ఉట్లపల్లి లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదుర్కొన్న అందరు తప్పించుకున్నారన్నారు. వీటన్నింటిలో కూడా విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ పాల్గొన్నట్లు తెలిపారు.
మరో మావోయిస్టు అయినా సోడి బాలకృష్ణ 2018లో చర్ల ఏరియా కమిటీ మలేషియా మెంబర్ గా అరుణ్ డీవీసీ ఆధ్వర్యంలో చేరినట్లు తెలిపారు. 2019లో చర్ల ఏరియా కమిటీ పార్టీ మెంబర్గా శారద ఏసీఎస్ ఆధ్వర్యంలో పని చేసినట్లు తెలిపారు. 2022- 23లో మనుగు ఏరియా కమిటీ ఏసీఎస్ మంగుతు గార్డుగా పని చేసినట్లు చెప్పారు.
ఇప్పటివరకు కూడా చర్ల కమిటీ ఏసి మెంబర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. 2019 ఫిబ్రవరిలో కొండపల్లి లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అందరూ తప్పించుకున్నారన్నారు. 2020 లో రెంగావ్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు.
2021 లో కర్రి గుట్ట లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు. 2022 కొండపల్లి పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అందరూ తప్పించుకున్నట్లు తెలిపారు.
2022లో పుంజారి కాంకెలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు. 2023లో పాలగూడ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు. 2023లో కర్రి గుట్ట లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయినట్లు పేర్కొన్నారు.
2024లో ధర్మారం సిఆర్పిఎఫ్ క్యాప్ పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లాలని ప్రయత్నించగా ఇందులో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు. ఈ కేసుల్లో సోడి బాలకృష్ణ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు వివరించారు.
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన ఈ ఇద్దరు ఆ పార్టీలో జరుగుతున్న అర్థం లేని హింస, సిద్ధాంత లేమీ తదితర సంఘటనలు చూసి పార్టీపై ఉన్న భ్రమలు తొలగిపోయి వాస్తవాన్ని గ్రహించారన్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు దూరమై పతనం అంచున ఉన్నదన్నారు. ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న సంఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు.
చాలామంది మావోయిస్టులు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు పార్టీని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారన్నారు…. కామారెడ్డి జిల్లా నుంచి ఐదుగురు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్రావు అలియాస్ పడకాల స్వామి అలియాస్ ప్రభాకర్, మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఎర్ర గొల్ల రవి అలియాస్ దినేష్, ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకేటి రమేష్, లోకేటి లావణ్య అలియాస్ శాంతి, అడ్లూరు ఎల్లారెడ్డి కి చెందిన లింగయ్య గారి వెంకట్ రెడ్డి లు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు.
వీరు కూడా జనజీవ స్రవంతి లోకి రావాలని ఆమె కోరారు. వీరు జనజీవన స్రవంతి లోకి వస్తే ప్రభుత్వ ప్రతిఫలాలు, పునరావాసం, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సీఐ తిరుపయ్య కూడా పాల్గొన్నారు.
