నిజామాబాద్ నగరంలో పలు పంతంగి దుకాణాల్లో పోలీసులు ఆదివారం తనిఖీ లు చేశారు ఎన్ కే కైట్ షాప్ సుల్తాన్ కైట్ షాప్ ల్లో రెండో టౌన్ పోలీసులు తనిఖీలు చేయగా రెండు షాపులలో నిషేదిత చైనా మాంజా తొమ్మది వేల రూపాయల విలువైన రెండు బండళ్ళులభ్యం అయ్యాయి.
అట్టి షాపు యజమానులపై భారతీయ న్యాయ సంహిత మరియు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగినది ఇటువంటి చైనా మాంజా ఎవరు అమ్మిన అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రెండో టౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ హెచ్చరించారు.
