ఎన్నికల ప్రచారం లో భాగంగా సీఎం రేవంత్ నిజామాబాద్ జిల్లాకు కాసేపట్లో వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం లో హాజరు కానున్నారు.
ఆదిలాబాద్ నుంచి నేరుగా నిజామాబాద్ జిల్లాకేంద్రానికి రానున్నారు ఈ సందర్బంగా పాత కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి*హాజరవుతున్నారు.
సీఎం అయ్యాక రేవంత్ మొదటి సారిగా వస్తుండడంతో కాంగ్రెస్ క్యాడర్ లో నయా జోష్ కనిపిస్తుంది. భారీఎత్తున ప్రజలు సైతం ఈపాటికే సభాస్థలం కు వచ్చారు. సీఎం ఇంకా జిల్లాకు రాకముందే కార్యకర్తల కోలాహలం కనిపిస్తుంది. లోకసభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ల నుంచి జనసమీకరణ చేసారు. ఇన్నటిదాకా వాతావరణ చల్లబడే ఉండే కానీ సోమవారం భానుడు ప్రతాపం చూపిస్తున్నారు.