లిక్కర్ కేసులో అరెస్టు అయిన . కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజ విచారణ జరుపనున్నారు.లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని కవిత పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. అలాగే, నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పుకొచ్చారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు.
కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని, ఆప్-సౌత్ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారు. లిక్కర్ స్కాంలో భాగంగా రూ.100కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర.
ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారు. కిక్ బ్యాగ్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారు. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్‌లో డేటాను డిలీజ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.