కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని , నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ, నీట్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో వామపక్ష పార్టీలు సిపిఐ,సిపిఎం,సిపిఐ(ఎం- ఎల్ న్యూడెమోక్రసీ),సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తు ప్రైవేటీకరిస్తున్నారని వేలాదిమంది కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
నీట్ పరీక్ష పత్రం లీక్ చేసి 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో NTA ఏజెన్సీ చెలగాటమాడుతుందని మండిపడ్డారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని , NTA ను రద్దు చేయాలని,రాష్ట్రాల పరిధిలో నీట్ పరీక్ష నిర్వహించాలని , విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి సుధాకర్, వామపక్షాల నాయకులు ఒమయ్య ,శివకుమార్ , నూర్జహాన్ , పెద్ది వెంకట్ రాములు , సర్పలింగం , ముత్తన్న , రాజేశ్వర్, కృష్ణ గౌడ్,సాయిరెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు.
