Saturday, April 26, 2025
HomeTelanganaNizamabadనిరాశతో నిష్క్రమించిన... ప్రాదేశిక సభ్యులు-

నిరాశతో నిష్క్రమించిన… ప్రాదేశిక సభ్యులు-

నిరాశతో నిష్క్రమించిన… ప్రాదేశిక సభ్యులు- నిధులు లేక నిరసనతో పూర్తి- ఎంపీటీసీ, జెడ్పిటిసిలకు దక్కని కనీస గౌరవం- పదవీకాలం ముగిసిన రాని గౌరవ వేతనం – జడ్పీ, మండల పరిషత్తులు నిధులు లేక నిర్వీర్యం- అనేక గ్రామాల్లో అప్పుల పాలైన ఎంపీపీ, జడ్పిటిసి లు- ఉత్సవ విగ్రహాలుగా మారిన ప్రాదేశిక సభ్యులు.

జాన రమేష్ : ఇది సంగతి : ఆర్మూర్ :

ప్రాదేశిక సభ్యులుగా కొనసాగిన పదవి కాలం రెండింటికి చెడ్డ రేవడిలా మారింది. ఇటు ఆశించిన గౌరవం దక్కలేదు, అటు చేయాలనుకున్న అభివృద్ధి చేయుటకు నిధులు లేక సభ్యులకు నిరాశే దక్కింది.

ప్రత్యక్ష ఎన్నికల్లో సర్పంచ్ లతో సమానంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రాదేశిక సభ్యులు ఎన్నికల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎన్నికైనప్పటికీ తమకు రావాల్సిన గౌరవ వేతనం 6 నెలలుగా దక్కకపోవడంతో పదవి కాలం ముగిసిన ఫలితం కోసం ఎదురు చూసే పరిస్థితి దాపురించింది.

ఎన్నికల కోసం పెట్టిన ఖర్చు వల్ల అనేక గ్రామాల్లో ఎంపీటీసీలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులు ఐదేళ్ల పదవీకాలం ముగిసిన గత ఆరు నెలల నుంచి గౌరవ వేతనం కోసం ఎదురుచూస్తున్నారు.

జడ్పీ చైర్మన్, జడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీలకు గత ఆరు నెలలుగా ప్రభుత్వం గౌరవ వేతనాలు అందించకపోవడంతో వేతనం అందకుండానే చివరకు తమ పదవీకాలం ముగించుకునే పరిస్థితి దాపురించింది.

స్థానిక సంస్థలను పటిష్టం చేసి క్షేత్రస్థాయిలో వారికి కీలక అధికారంతో పోటు పాటు బాధ్యతలని అప్పగిస్తామని గత ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయి.

జడ్పిటిసి ఎంపీలకు నెలకు 13000, ఎంపీటీసీలకు ప్రతినెల 6,500 గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అంతకుముందు ఉన్న వేతనాన్ని సవరించి 30 శాతం అప్పటి ప్రభుత్వం పెంచింది.

జిల్లా, మండల పరిషత్ లకు గత రెండేళ్ల నుండి నిధుల కొరత నీడలా వెంటాడింది. 2019 నుండి 2024 వరకు వివిధ సేస్ ల రూపంలో రావాల్సిన పన్నులు, ఇతరమైన నిధులు నిలిచిపోవడంతో జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధుల లేమితో నిర్వీర్యంగా మారిపోయాయి దీంతో సమావేశంలో చేసిన ప్రజాప్రతినిధుల తీర్మానాలకు అతిగతి లేకుండా పోయింది.

15వ ఆర్థిక సంఘం స్పెషల్ గ్రాంట్, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు మాత్రమే జడ్పిటిసి లకు ప్రాదేశిక అభివృద్ధి నిధుల కింద అక్కడక్కడ అరకోరగా మంజూరయ్యాయి.

ఐదేళ్ల పాలనలో నిధుల కొరత వల్ల అభివృద్ధి చేయలేకపోయామని మారుమూల ప్రాంతాలకు తాగునీరు రోడ్లు మౌలిక సదుపాయాలను కల్పించలేకపోయామని పదవి వీడ్కోలు పలికిన ప్రజాప్రతినిధులు పెదవి విరుస్తూ పదవీకాలం నుండి నిష్క్రమించారు.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్థానిక సంస్థలను పటిష్టం చేసేందుకు ప్రత్యేక గౌరవంతో పాటు, విధులు కేటాయించాలని తాజా మాజీలు కోరుతున్నారు. లేదంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలకు పోటీ చేసే ఆశావాహులు వెనకడుగు వేయక తప్పని పరిస్థితి ఏర్పడేలా ఉంది.

సర్పంచులతో సమానంగా కార్యనిర్వహణలో అధికారులు కల్పించాలి

* గుడాల గంగాధర్. తాజా మాజీ ఎంపీటీసీ. పచ్చల నడ్కుడ*

ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నుకోబడిన ఎంపీటీసీలకు ‘ గ్రామ పాలనలో సర్పంచ్ సమానంగా కార్యనిర్వాహణ హక్కులు ఉండాలి.

ప్రజా సేవ చేసేందుకు ఎంపీటీసీగా హోదా తక్కిన పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు సముచిత స్థానం దక్కడం లేదు.గౌరవ వేతనం అందించాలి

*మెట్టు సంతోష్ తాజా మాజీ జెడ్పిటిసి ఆర్మూర్*

గత ఆరు నెలలుగా మాకు రావలసిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందించలేదు. పదవి కాలం ముగిసిన ఇంతవరకు మాకు గౌరవ వేతనం రాలేదు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో సక్రమంగా గౌరవ వేతనాలు అందించారు. మా వేతనం మాకు వచ్చారా చర్యలు తీసుకోవాలి.నిధుల కొరతతో అభివృద్ధి చేయలేకపోయాము

*అల్లకొండ భారతి రాకేష్ చంద్ర.*

తాజా మాజీ జెడ్పిటిసి .వేల్పూర్ఎన్నికయ్యాక రెండేళ్లు కరోనాతో కాలం గడిచిపోయింది. మిగిలిన మూడేళ్లలో అభివృద్ధి కోసం ఆశించిన నిధులు రాలేదు.

వచ్చిన అరకురా నిధులను నియోజకవర్గంలో అగ్ర నాయకుల కనసన్నాల్లో వెచ్చించాల్సి వచ్చింది. వ్యవస్థలో ప్రాదేశిక సభ్యులకు నిధులు పెంచాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!