HomeCRIMEహోటళ్లు, సూపర్ మార్కెట్లపై మున్సిపల్ అధికారులు దాడులు...

హోటళ్లు, సూపర్ మార్కెట్లపై మున్సిపల్ అధికారులు దాడులు…

నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ ఆద్వర్యంలో రెవెన్యూ అధికారులు,మరియు శానిటైజింగ్ అధికారులు సంయుక్తం గా శుక్రవారం నగరం లోని పలు హోటళ్ళు,సూపర్ మార్కెట్లు,షాపింగ్ మాల్లో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పన్నులు చెల్లించని, వ్యత్యాసం ఉన్న పలు వాటికి నోటీసులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా పెద్ద షో రూమ్ లో ట్రేడ్ లైసెన్స్, లేని వాటికి నోటీసు లు ఇచ్చి జరిమానా విధించమని తెలిపారు.

పలు హోటల్ లో కూడా తనిఖీలు చేసి, కల్తీ ఆహార పదార్థాలను నాసిరకం వంటలతో పాటూ కిచెన్‌లో అపరిశుభ్రతను గుర్తించి.. ఓ హోటల్ పైన పది వేల రూపాయలు జరిమానా వేశామని పేర్కొన్నారు.

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలో రెవెన్యూ ఆద్వర్యంలో నరేందర్ టీమ్, శనిటైజింగ్ ఆధ్వర్యంలో షాయిద్ అలీ టీమ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments