పాత కలెక్టరేట్ మైదానం, మహాలక్ష్మినగర్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలునగరంలో ఆదివారం బోనాల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తెలంగాణ గెజిటెడ్ సంఘం ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.
అనంతరం మహాలక్ష్మినగర్‌లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కూడా ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించగా, పోతరాజుల విన్యాసాలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమన్నారు.
ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, తెలంగాణ గెజిటెడ్ సంఘం ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
