36 రోజుల పాటు ఉద్యమం చేసి కేంద్రం దిగి వచ్చేలా విద్యార్థులు చేశారని కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన స్థితి తెచ్చారని టిఆర్ యస్ అధ్యక్షురాలు కవిత అన్నారువెయ్యి శాతం ఇది విద్యార్థులు సాధించిన ఘన విజయం ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించటం సిగ్గుచేటన్నారు ఇదేదో తమ ఘనత లాగ క్యాండిల్ ర్యాలీ లో నాలుగు గంటల పాటు నగర వీధుల్లో ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నాయకులు ఊరేగింపు చేశారని కవిత ఎద్దేవా చేశారు విద్యార్థులు ఎక్కడ నిలదీస్తారోనని ముందుగానే ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఊరేగింపులు చేశరని యువతకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఏదీ మీరు చేయలేదని అందుకే మిమ్మల్ని యువత నమ్మే అవకాశం లేదు.ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అట్టహాసంగా వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కొవ్వొత్తులు పట్టుకొని ఉరేగితే విద్యార్థులు మిమ్మల్ని నమ్మరు. మీ చరిత్ర అందరికీ తెలుసు. ఇకనైనా యువతకు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇదే యువత మిమ్మల్ని గద్దె దించుతారు.
