వేడి నీళ్ళు ఒంటి మీద పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శనివారం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ నాగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.
బోధన్ మండలంలోని సాలూర గ్రామానికి చెందిన లక్ష్మీ భాయ్(71).ఇద్దరు కుమారులు,కూతురు ఉన్నట్లు తెలిపారు.జూన్ 28న తన కూతురు హున్షా గ్రామంలో ఉంటుంది. తన కూతురుని చూడానికి వెళ్లి అక్కడే ఉన్నారు.
ఈ క్రమంలో 28 ఉదయం లేచి బాత్ రూమ్ కి వెళ్ళి వస్తుండగా ప్రమాదవశాత్తూ వేడి నీటి బకెట్ పైన పడగ ఒంటి పైన వేడి నేరు పడి తీవ్ర గాయాలు అయ్యాయి.
అది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన చికిత్స నిమిత్తం బోధన్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.అక్కడనుంచి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.