నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా ‘తిమిరంతో సమరం’ చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, దాశరథి తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నిజాం రాజు బంధించిన నిజామాబాద్ ఖిల్లా నుంచే సమర శంఖారావం పూరించారు.
ఇప్పుడే అదే ఖిల్లా నుంచి శ్రీరామ నవమి నాడే జాగృతి వ్యవస్థాప రాలు కవిత తదుపరి రాజకీయ ప్రస్థానానికి నాంది పలక బోతున్నారు మెట్టినిల్లు నిజామాబాద్ లోనే ఆమె తన రాజకీయ పార్టీ ఫై కీలక ప్రకటన చెయ్యబోతున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ఖిల్లా రామాలయం వేదికగా ఆమె రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఆధ్యాత్మిక కార్యక్రమాల సాక్షిగా తన తదుపరి రాజకీయ అడుగులు కోసం ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు కవిత నిజామాబాద్‌కు రానున్నారు. నగరంలోని చారిత్రాత్మక ఖిల్లా రామాలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆమె పాల్గొననున్నారు.
అయితే ఈ పర్యటన కేవలం దైవ దర్శనానికే పరిమితం కాదని, అదే వేదికగా తన రాజకీయ పంథాను స్పష్టం చేస్తూ కొత్త పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తనకు రాజకీయంగా అండగా నిలిచిన నిజామాబాద్ జిల్లా నుంచే తన కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలని కవిత భావిస్తున్నారు.
ఇక్కడి నుంచే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే యోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ఆమె 2014 లో ఎంపీ గా పోటీ చేసి గెలిచారు.
ఎంపీ ఢిల్లీ స్థాయిలో గట్టిగా పనిచేసిన పార్టీలో నెలకొన్న పరిస్థితులు తదుపరి ఎంపీ ఎన్నికల్లో ఆమె ఓడి పోయేలా చేసాయి.సిట్టింగ్ ఎమ్మెల్యే లు రెండో సారి భారీ మెజార్టీ తో గెలిచినా కవిత రెండో ఎంపీ గాపరాజయం పాలయ్యారు.
ఎన్నికల్లో ఓడిపోయాక ఆమె జిల్లా క్రియశీలా రాజకీయాలకు దూరం అయ్యారు పార్టీ ప్రభుత్వం లో తిరుగు లేని ఆధిపత్యం చెలాయించారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే వెన్నుపోటు తో ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూసారు.
ఆ తర్వాత నిజామాబాద్ లోకల్ బాడీ నియోజకవర్గం కోట లో శాసన మండలి సభ్యురాలు గా గెలిచారు కానీ పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉండి పోయారు.లిక్కర్ కేసు తర్వాత బిఆర్ యస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు కు సిద్ధం అవుతున్నారు.
