నిజామాబాద్ పట్టణంలోని వర్ణీ చౌరస్తా వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలని జిల్లా కలెక్టర్ మరియు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో కలెక్టర్, ఎమ్మెల్యే చర్చించారు. విద్యార్థులు తమ సమస్యలు, అవసరాలను వివరించారు.
కళాశాల భవనాల అభివృద్ధి, ఆధునిక సౌకర్యాల ఏర్పాటు, పాఠ్యాంశాల నాణ్యత పెంచే విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కలెక్టర్ గారు విద్యార్థుల అవసరాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే కళాశాల అభివృద్ధి కోసం ప్రభుత్వ స్థాయిలో అన్ని అవకాశాలను వినియోగిస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు.
