ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సంఘానికి చెందిన నేత ఇల్లందుల ప్రభాకర్ గారు బుధవారం రాత్రి 10 గంటలకు ఎన్నికల కమిటీకి వినతిపత్రం సమర్పించారు.
ఎన్నికల ప్రక్రియను గందరగోళంగా మార్చే విధంగా కొంతమంది అభ్యర్థులు, మధ్యవర్తులు అక్రమ ప్రయత్నాలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు ఎన్నికల కమిటీ వెంటనే చర్యలు తీసుకుని, అవకతవకలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అవసరమైతే పోలీసుల సహాయం తీసుకుని ఎన్నికల ఆవకతోకల పైన కౌంటింగ్ సక్రమంగా నిర్వహించేలా కోరారు.ఈ వివాదంతో నిజామాబాద్ ఆర్యవైశ్య సంఘంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి.
సంఘ సభ్యులు మాత్రం కౌంటింగ్ ప్రక్రియ స్వచ్ఛంగా, పారదర్శకంగా జరగాలని కోరుతున్నారు.
