HomeTelanganaNizamabadకళాశాలలలో సివిల్ పనులు పూర్తి చేయండి.. ...

కళాశాలలలో సివిల్ పనులు పూర్తి చేయండి.. ప్రిన్సిపాల్ ల సమావేశంలో జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్.

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మంజూరైన నిధులతో త్వరగా సివిల్ పనులను, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేసి బిల్లులు సబ్మిట్ చేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ ప్రిన్సిపాల్ లను ఆదేశించారు.

శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశం ఇంటర్ విద్యా కార్యాలయంలో జరిగింది. జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి మాట్లాడుతూ కళాశాలలో ఇతర మరమ్మతులు, ఎలక్ట్రికల్ మరమ్మతులు, అవసరమైన సామాగ్రి కొనుగోలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులు కూర్చునే ఫర్నిచర్ ను మరమ్మతులు చేయించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంటర్ విద్యా అధికారి ఆదేశించారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు ప్రిన్సిపాల్ లకు లెక్చరర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఈ శిక్షణ తరగతులకు అధ్యాపకులకు కేటాయించిన తేదీలలో హాజరయ్యే విధంగా ప్రిన్సిపల్ లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి ఆదేశించారు .అలాగే ఈ విద్యా సంవత్సరంలో మరిన్ని అడ్మిషన్లను పెంచేందుకు గాను కళాశాల ప్రిన్సిపల్ లు, అధ్యాపకులు సమన్వయంతో ప్రతి గ్రామంలో ఇంకా 10వ తరగతి చదివి కళాశాలల లో చేరని విద్యార్థులను గుర్తించి వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాలని ఆదేశించారు.

ఇదివరకే అడ్మిషన్లు ఆయిన విద్యార్థుల యు డైసు, ఆధార్ అప్డేట్లు వెంట వెంటనే చేయించాలని ప్రిన్సిపల్ లను జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు ఇప్పటినుండి ప్రణాళిక బద్ధంగా విద్యాబోధన చేయడంతో పాటు విద్యార్థిని విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించాలని, సామాజిక స్పృహ ను పెంపొందించాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి ప్రిన్సిపల్ లను ఆదేశించారు.

అలాగే విద్యార్థిని విద్యార్థులకు స్లిప్ టెస్టులతో పాటు నెలవారి పరీక్షలను నిర్వహించి వారి మార్కులను నమోదు చేయాలని, ఫలితాలను విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు విద్యార్థులను గ్రేడుల వారిగా విభజించి ప్రత్యేక శిక్షణను ఇచ్చే విధంగా ఇప్పటినుండి చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.

అధ్యాపకుల కొరత ఉన్న కళాశాలల్లో వెంటనే అతిథి అధ్యాపకులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. అలాగే బోధన బోధనేతర సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments